![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ లో ఆదిరెడ్డి అంటే చాలు కామన్‌మెన్ టూ బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్ అనే విషయం గుర్తొస్తుంది. ఆదిరెడ్డి ప్రస్థానం గురించి చెప్పాలంటే చాలా ఉంది. హౌస్ లో అతని ఆటతీరు, ఆటిట్యూడ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఉడల్ మామ. ఎక్కడా కూడా ఓవర్ చేసింది లేదు. తన లిమిట్స్ దాటి ప్రవర్తించింది కూడా లేదు. అలా తనను బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే వరకు తీసుకొచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటాడు. బిగ్‌బాస్ గత సీజన్ లో థర్డ్ రన్నరప్‌గా నిలిచి.. తన సత్తా చాటాడు.
బిగ్ బాస్ రివ్యూయర్ గా పేరు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 గురించి రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తాను అని చెప్పాడు. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ షో మీద ఏపీ హై కోర్ట్ సీరియస్ అయ్యింది. హీరో నాగార్జునకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ విషయం మీద ఆదిరెడ్డి తన స్పందన చెప్పాడు. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నాడు. "బిగ్ బాస్ బాన్ చేయమంటూ హై కోర్ట్ స్టార్ మాకి నాగ్ సర్ కి నోటీసులు ఇచ్చిందట..దాని మీద నా అభిప్రాయం అంటూ స్టార్ట్ చేసాడు. బీబీ షోలో వల్గర్ గా ఏమీ లేదు.
సినిమాలలో, ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో కొన్ని కామెడీ షోస్ లో ఉన్నంత వల్గారిటీ బిగ్ బాస్ లో ఏమీ లేదు. ప్రతీ ఏడాది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యేముందర ఇలా కావాలని చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇష్టం లేని వాళ్ళు చూడకుండా ఉంటారు. అంతేకదా...అని చెప్తూ ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏమిటి ? " అంటూ ఆడియన్స్ కూడా అడిగాడు. మరి వాళ్ళేమి ఆన్సర్ ఇస్తారో చూడాలి. బిగ్ బాస్ లాస్ట్ సీజన్ మీద ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయో చెప్పక్కర్లేదు. ఈ బిగ్ బాస్ మీద సిపిఐ నారాయణకి హోస్ట్ నాగ్ కి మధ్య కొంత కోల్డ్ వార్ జరిగిందన్న విషయం కూడా ఆడియన్స్ కి తెలుసు...ఏది ఎలా ఉన్న మా ఎంటర్టైన్మెంట్ మాకు ఉంటే చాలు అని ఆడియన్స్ బిగ్ బాస్ న్యూ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే అందులో ఎలాంటి మార్పులు చేశారనే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.
![]() |
![]() |